ఘనంగా టంగుటూరి జయంతి
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:21 AM
జిల్లా పోలీసు కార్యా లయంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు శని వారం ఘనంగా నిర్వహించారు.
నంద్యాల టౌన్, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు కార్యా లయంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు శని వారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో విజయాలు అందు కున్నారని నాయకుడిగా, రచయితగా, విశేష ప్రతిభాశాలిగా కీర్తి గడిం చారని కొనియాడారు. యువత ఆయనను స్పూర్తిగా తీసుకుని మంచి మార్గంలో నడవాలని కోరారు. ఏఎస్పీ యుగంధర్ బాబు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.