ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:20 AM
రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోరారు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోరారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఆమె పోలీసు, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అఽదికారులతో ఎమ్మెల్యే చర్చించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, ఎంపీడీవో నూర్జహాన, ఆర్టీసీ, పంచాయతీరాజ్ , పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.