Share News

ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:37 PM

రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో మళ్లీ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డా.ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.

 ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు కలెక్టరేట్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో మళ్లీ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డా.ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌తో కలిసి కలెక్టర్‌ డిస్ర్టిక్ట్‌ రోడ్‌ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్‌హెచ్‌-340సీకి సంబంధించి నందికొట్కూరు రోడ్డులో చేపడుతున్న పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆర్‌డీవో, ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ నేషనల్‌ హైవే అనంతపురం స్ర్టెచ్‌లో సైన్‌ బోర్డ్స్‌ వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, కర్నూలు ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గంజాయి సాగు చేస్తే శిక్షలు తప్పవు

గంజాయి సాగుచేసినా, గంజాయితో పట్టుబడినా శిక్షలు తప్పవని కలెక్టర్‌ డా.ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ హెచ్చరించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాలులో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించి జిల్లా సమన్వయ కమిటీ (ఎన్కౌర్ట్‌) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సచివాలయాల అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, హార్టికల్చర్‌ అసిస్టెంట్లు, గంజాయి సాగుపై గట్టి నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ కాలేజీలు, పాఠశాలల్లో, మత్తు పదార్థాలను తీసుకోకూడదని హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 11:37 PM