జాగ్రత్తలతో పంట క్షేమం
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:30 AM
వారం నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులు జాగ్రత్తలువు పాటించాలని ఏవో రవి సూచించారు. శనివారం మాట్లాడుతూ మండలంలో 7,500 హెక్టార్లలో పత్తి, వేరుశనగ, జొన్న, కంది పంటలు సాగు చేశారని పొలంలో నీరు ఉండకుండా చూసుకోవాలన్నారు.
పొలంలోని నీటిని బయటకు పంపాలి
సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి : ఏవో
మద్దికెర ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): వారం నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులు జాగ్రత్తలువు పాటించాలని ఏవో రవి సూచించారు. శనివారం మాట్లాడుతూ మండలంలో 7,500 హెక్టార్లలో పత్తి, వేరుశనగ, జొన్న, కంది పంటలు సాగు చేశారని పొలంలో నీరు ఉండకుండా చూసుకోవాలన్నారు.
పత్తిలో జాగ్రత్తలు..
పొంలో నీరు నిల్వ ఉంటే తేమ అధికమై పత్తి పిందెలు, కాయలు రాలిపోపయే ప్రమాదం ఉందని, ఆకులు వాడిపోతాయన్నారు. పొలం ముంపునకు గురైనప్పుడు నీటిని తీసేయడంతో పాటు ఎండగా ఉన్న సమయంలో లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 5 గ్రాములను కలిపి, లేదా ఒక శాతం యూరియా ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో మార్చి మార్చి పిచికారీ చేయాలి. పూత, పిందె దశలో తీసిన తర్వాత ఎకరాకు 30 కిలోల యూరియాను 1.5 కిలోల పోటాష్ ఎరువులను పైపాటుగా వేసుకోవాల న్నారు. అలాగే వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు మెగ్నీషియం సల్ఫేట్ పిచికారీ చేయాలని సూచించారు. తేమ అధికంగా ఉంటే వేరుకుళ్లు తెగుళ్లు, బ్యాక్టీరియా నల్లమచ్చ తెగుళ్లు, చుట్టతెగుళ్లు ఆశించే అవకాశం ఉందని, వీటి నివారణకు కాపర్ ఫ్లోరైడ్ కలిపి రెండు మూడుసార్లు పిచికారీ చేసుకోవాలని, తుప్పు తెగుళ్ల నివారణకు ప్రొసికోంజోల్ లీటరు కలిపి పిచికారీ చేయాలని వివరించారు.
కంది పంటలో..
కంది ప్రస్తుతం శాఖీయ దశలో ఉందని, పొంలోని నీటిని తీసివేసి, ఒక లీటరు నీటిలో పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలన్నారు. పొలం ఆరిన వెంటనే అంతర పంటలు సాగుచేయాలన్నారు. తెగుళ్ల నివారణకు డయోపివెట్ మిథైల్ ఒక లీటరు నీటిలో కలిపి మొక్కల చుట్టూ వేరు అంతా తడిసేలా పిచికారీ చేయాలని తెలిపారు.
వేరుశనగలో..
పొలంలోని నీటిని బయటకు పంపి పొలం ఆరిన తర్వాత అంతర పంటలను సాగుచేయాలన్నారు. ప్రస్తుతం తిక్క ఆకు మచ్చ తెగులు ఆశించే అవకాశం ఉందని, నివారణకు హెడ్డా కొనజోల్ ఒక మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. వేరుశనగ కోతకు సిద్ధంగా ఉంటే ఈ వర్షాలు తగ్గాక కోయాలన్నారు. ఇంకా సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.
నీటిని బయటకు పంపాలి
ఆదోని రూరల్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): అధిక వర్షాల నేపథ్యంలో పత్తిపొలాల్లో నీరు నిలవ వుండకుండా బయటకు పంపాలని ఏవో సుధాకర్ శనివారం ప్రకటనలో సూచించారు. యూరి యా అధికంగా వాడితే తెల్లదోమ, రసం పీల్చే పురుగుల ఉఽధృతి పెరుగుతుందన్నారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు యూరియా వాడాలని, పంట త్వరగా కోలుకోవడానికి నానో డీఏపీ పిచికారీ చేయాలన్నారు.