ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: మంత్రి ఫరూక్
ABN , Publish Date - Sep 08 , 2025 | 01:09 AM
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: మంత్రి ఫరూక్‌ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సూచించారు.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: మంత్రి ఫరూక్‌ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సూచించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం రూ.28 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలు వైద్య పరంగా స్థోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు పార్టీ కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. 29 మందికి సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేయించానని తెలిపారు. 29 మందికి రూ.29 లక్షలు బాధిత కుటుంబ సభ్యులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారన్నారు. కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ హరిబాబు, గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.