జీఎస్టీ ధరలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:19 PM
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ 2.0 ద్వారా వస్తువులపై తగ్గించిన ధర లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ ఉపక మిషనర్ కె.వెంకటేశ్వర్లు సూచించారు.
కార్మిక శాఖ ఉపకమిషనర్ వెంకటేశ్వర్లు
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ 2.0 ద్వారా వస్తువులపై తగ్గించిన ధర లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ ఉపక మిషనర్ కె.వెంకటేశ్వర్లు సూచించారు. కార్మిక శాఖ అధ్వర్యంలో శుక్రవారం రాజవిహార్ నుంచి సి.క్యాంపు, సి.క్యాంపు నుంచి కలెక్టరేట్ వరకు జీఎస్టీ 2.0పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎ.గాయత్రి, ఉపాధి కల్పనాధికారి దీప్తి, సహాయ కమిషనర్ సాంబశివ హాజర య్యారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలు తగ్గిన ధరలపై అవ గాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేఎంఎల్ గాయత్రి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ సీతాలక్ష్మి, సహాయ అధికారులు హేమాద్రి, సమీర్‌బాషా, నీలిమ సంధ్య, సిబ్బంది పాల్గొన్నారు.