‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ను విజయవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:09 PM
జిల్లా అంతటా స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాలు సక్రమంగా జరగాలి
కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా అంతటా స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్వర్ణాంధ్ర - స్వచ్ఛా ంధ్ర, ఉపాధి హామీ తదితర అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మాన్‌సూన్ హైజీన్ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా ర్యాలీలు, అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మెరుగైన సేవలు అందిస్తున్న వారికి తగిన గుర్తింపును ఇచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి రోజు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కుటుంబానికి సగటున ఉపాధి కల్పనలో, వంద పనిదినాల కల్పనలో పురోగతి తీసుకుని రావాలన్నారు. 8,500 పంటకుం టలకు గానూ 3,497 పూర్తయ్యాయని, మిగతా వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వామిత్వ కార్యక్రమంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న గ్రౌండ్ ట్రూతింగ్ పనులను వారం రోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈవో నాసరరెడ్డి, డ్వామా పీడీ వెంకటరమణయ్య, డీపీవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.