Share News

కలెక్టర్‌ను కలిసిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందం

ABN , Publish Date - Jul 03 , 2025 | 11:54 PM

కేంద్రం నుంచి వచ్చిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ టీం, డీపీవో లలితాబాయి గురువారం కలెక్టర్‌ రాజకుమారిని పట్టణంలోని కలెక్టరేట్‌లో కలిశారు.

కలెక్టర్‌ను కలిసిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందం
కలెక్టర్‌కు సర్వే గురించి వివరిస్తున్న సభ్యులు

నంద్యాల టౌన్‌, జూలై 3(ఆంధ్రజ్యోతి): కేంద్రం నుంచి వచ్చిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ టీం, డీపీవో లలితాబాయి గురువారం కలెక్టర్‌ రాజకుమారిని పట్టణంలోని కలెక్టరేట్‌లో కలిశారు. బృందం సభ్యులు మాట్లాడుతూ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు, కేంద్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో పరిశుభ్రత, పారిశుధ్య పద్ధతుల ఆధారంగా గ్రామాలను అంచనా వేసి వాటికి ర్యాంకులు ఇవ్వనున్నట్లు తెలిపారు. పారిశుధ్యంపై అవగాహన, పౌరుల భాగస్వామ్యం పెంచడం, గ్రామ, పట్టణాల్లో పరిశుభ్రత ప్రమాణాలు పెంచడం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో పర్యటించే సమయంలో పంచాయతీ కార్యదర్శులు సహకరించాలని ఆదేశించారు.

Updated Date - Jul 03 , 2025 | 11:55 PM