Share News

ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:36 PM

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం జమ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులను ఆదివారం సస్పెండ్‌ చేశారు.

ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌

ఆత్మకూరు(శ్రీశైలం), జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం జమ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులను ఆదివారం సస్పెండ్‌ చేశారు. వివరాలివీ.. గత నెల 27వ తేదిన చంద్రావతి కల్యాణ మండ పంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ హుండీ లెక్కిం పునకు సంబంధించి వచ్చిన మొత్తాన్ని క్యాషియర్లుగా వ్యవహ రిస్తున్న జూనియర్‌ అసిస్టెంట్లు బి.శ్రీనివాసులు, హెచ్‌.మంజు నాథ్‌ రెండు సంచుల్లో బ్యాంకుకు తీసుకెళ్లి జమచేశారు. అయితే నాణేలతో కూడిన ఓ సంచిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ సంచిని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది దేవస్థానం క్యాషియర్లకు అప్పగించారు. అయితే ఆ మొత్తాన్ని దేవస్థానం అధికారులకు తెలియజేయకుండా తమవద్దే ఉంచుకోవడంపై ఉన్నధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై విచారణ చేపట్టిన దేవస్థానం అకౌంట్స్‌ ఆఫీసర్లు క్యాషియర్‌ వద్ద ఉన్న నాణేల సంచిని స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో చెల్లుబాటు కాని 10పైసలు, 20పైసలు, 25పైసలు, 50పైసల నాణేలతో పాటు రూపాయి, రూ.2 నాణేలు ఉన్నట్లు గుర్తించారు. అందులో నుంచి చెల్లుబాటు అయ్యే చిల్లర నాణేలను వేరుచేసి వాటిని ప్రత్యేకించి సంచిలో భద్రపరిచి ఆమొత్తాన్ని అమ్మవారి హుండీలో వేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇరువురు జూని యర్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేయాలని నిర్ణయించారు. కాగా వీరిలో బి.శ్రీనివాసులు శ్రీశైలంలోనే విధులు నిర్వహించడంతో ఆయన్ని సస్పెండ్‌ చూస్తూ దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. మంజునాథ్‌ ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా కాణిపాకం దేవస్థానానికి వెళ్లడంతో అక్కడి ఈవోకు సిఫారసు చేశారు. దీంతో ఆయననకు కూడా సస్పెండ్‌ చేశారని చెప్పారు. ఇదిలావుంటే సస్పెన్షన్‌కు గురైన ఇరువురు ఉద్యోగుల్లో నెలకొన్న అంతర్గత విబేధాల వల్లే ఈ భాగోతం బయటపడినట్లు తెలిసింది. మొత్తానికి ఈ వ్యవహారం శ్రీశైలంలో చర్చనీయాం శంగా మారింది.

Updated Date - Jun 22 , 2025 | 11:36 PM