74 ఏళ్ల మహిళకు అరుదైన శస్త్ర చికిత్స
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:09 AM
అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన 74 ఏళ్ల సాలమ్మకు కర్నూలు కిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు.
కర్నూలు హాస్పిటల్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన 74 ఏళ్ల సాలమ్మకు కర్నూలు కిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. శనివారం స్పైన్ సర్జన్ డా.షేక్ మన్నన్ రోగితో కలిసి వివరాలు వెల్లడించారు. సాలమ్మ నడుం నొప్పితో మంచానికి పరిమితమైంది. ఈ నెల 2న కర్నూలు కిమ్స్ హాస్పిటల్‌కు వచ్చింది. ఎంఆర్‌ఐ పరీక్ష చేయగా.. వెన్నముకలోని డీ11, డీ12 భాగం వద్ద కంప్రెషన్ ప్రాక్చర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 3న 19 స్ర్కూలను ఉపయోగించి ఆరు గంటలు శ్రమించి క్లిష్టమైన ఆనపరేషన్ చేసి వంగిపోయిన వెన్నముకను సరిచేసి మళ్లీ సాధారణ స్థితికి తెచ్చారు. శస్త్ర చికిత్సలో పూర్తిగా టైటానియం, డ్యూయల్ త్రేడెడ్ స్ర్కూలను ఉపయోగించామని, వీటితో ఇన్‌ఫెక్షన్ ఉందని డా.షేక్ మన్నన్ తెలిపారు. రోగి కోలుకోవడంతో ఈ నెల 9వ తేదీన డిశ్చార్జ్ చేశామన్నారు.