సురవరం మృతి పార్టీకి తీరని లోటు
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:51 AM
పార్లమెంటు మాజీ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతి సీపీఐకి తీరని లోటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామచంద్రయ్య అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామచంద్రయ్య
డోన రూరల్, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): పార్లమెంటు మాజీ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతి సీపీఐకి తీరని లోటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామచంద్రయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని షాధీఖానాలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. రామచంద్రయ్య మాట్లాడుతూ సురవ రం సుధాకర్ రెడ్డి పార్టీకి చేసిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్ర మంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రాధా కృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, వెంకట నాయు నిపల్లె, టీడీపీ నాయకుడు శ్రీనివాసులు యాదవ్ పాల్గొన్నారు.