గోకులం షెడ్లతో ఊతం
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:47 AM
కూటమి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం గోకులం షెడ్లను నిర్మిస్తోంది.

ఆలూరులో ఇప్పటికే 43 షెడ్ల పూర్తి
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ఆలూరు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం గోకులం షెడ్లను నిర్మిస్తోంది. వ్యవసాయంలో లాభాలు రాకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయంగా పశుపోషణ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించి షెడ్లను నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మండలంలో ఇప్పటికే 43 షెడ్ల పూర్తి..
ఆలూరు మండలానికి ప్రభుత్వం 53 గోకులం షెడ్లను మంజూరు చేసింది. ఇప్పటికే 43 షెడ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్, నాయకులు, సర్పంచులు, అధికారులతో కలిసి ఇటీవల ప్రారంభించారు. గతంలో పశువులు ఎండకు ఎండుతూ, వానకు తడిసిపోతుండేవని రైతులు అంటున్నారు. పశువులకు వసతులు లేక చెట్ల కింద కట్టేసేవారని, కూటమి ప్రభుత్వం షెడ్లు నిర్మించడంతో రక్షణ లభించిందని పశువుల యజమానులు చెబుతున్నారు.
బిల్లులు మంజూరు చేయాలి
గోకులం షెడ్ల నిర్మాణానికి రూ.1.50 లక్షలు కేటాయించారు. నిర్మాణాలు కూడా పూర్తిచేఏశశరు. అయితే బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు కోరారు.
ఆలూరు ఉపాధి ఏపీవో శ్రీనివాసులును వివరణ కోరగా షెడ్లను పూర్తిచేసి, ఎం.బుక్స్ సిద్ధం చేసి బిల్లులు పెట్టామన్నారు. నిఽధులు మంజూరు కాగానే లబ్ధిదారులకు డబ్బు జమ అవుతుందన్నారు.