పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలి
ABN , Publish Date - May 14 , 2025 | 12:25 AM
పారిశ్రామిక అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని టీజీవీ గ్రూప్స్ అధినేత, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ కోరారు.
తమ సంస్థలో పీఎఫ్‌ఓఏ కెమికల్‌కు దూరం
మేధావులు ఆరు నెలల్లో నిరూపించాలి
ఆ తరువాతే ఉత్పత్తి చేపడుతాం
టీజీవీ గ్రూప్స్ అధినేత, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్
కర్నూలు, మే13 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని టీజీవీ గ్రూప్స్ అధినేత, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ కోరారు. టీజీవీ ఎస్‌ఆర్‌ఏఏసీ ప్రతిపాదిత విస్తరణలో పీఎఫ్‌ఓఏ కెమికల్, దాని సంబంధిత లవణాన్ని వాడడం లేదని ఆయన స్పష్టంచేశారు. మంగళవారం నగరంలోని మౌర్యఇన్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పీఎఫ్‌ఓఏ కెమికల్ దిగుమతి చేసుకోవడానికి, వినియోగించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని, ఆ కెమికల్ ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉందని తెలిపారు. తమ పరిశ్రమ నుంచి క్లాసిక్ సోడా, క్లోరోమీఽథేన్స్ సామర్థ్య విస్తరణ, పీటీఎఫ్‌ఈ అదనపు ఉత్పత్తుల కోసం ప్రభుత్వ అనుమతి తీసుకున్నామన్నారు. ఈ నెల 14న ప్రజా అభిప్రా య సేకరణ ఉందని తెలిపారు. ఈ ప్లాంట్ వల్ల ప్రమాదకరమని కొందరు దుష్ప్రచారం చేస్తున్నార న్నారు. క్లాసిక్ సోడా తయారీ పరిశ్రమలు ఏపీలో 4, తమిళనాడులో 4, కేరళలో ఒకటి ఉందని, వివిధ రాష్ట్రాల్లో 35 ఉన్నాయని తెలిపారు. అక్కడ లేని ప్రమాదం కర్నూ లులో ఉంటుందా..? ఇక్కడ మాత్రం ఆందో ళనలు చేయడం ఎంత వరకు న్యాయమని, ఎక్కడ కూడా ఈ పరిశ్రమలు ప్రమాదక రమని చెప్పలేదని అన్నారు. ఆ ప్రాంతంలో పని చేసే కొందరు మేధావులు, ప్రజలు వచ్చి కావాలనే ఇక్కడి ప్రజలను తప్పుతోవ పట్టిస్తూ రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ తయారయ్యే క్లోరిన్ సుమారుగా 130 కోట్ల ప్రజల తాగునీటిని శుద్ధి చేయడానికి వాడుతు న్నారని, నీటి శుద్ధికి క్లోరిన్ వాడకపోతే ఏటా లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. ఇక్కడ ఉత్పత్తయ్యే క్లాసిక్ సోడా, హైడ్రో క్లోరిన్ ఆసిడ్ వివిధ రకాల ఔషదాలు తయారీలో ఉపయోగి స్తారని తెలిపారు. ఈ కెమికల్స్ వాడకుండా ఎలాంటి మందులు తయారు చేయలేర న్నారు. తాము విస్తరించబోయే పరిశ్రమలో ఎలాంటి పీఎఫ్‌ఓఏ కెమికల్, దాని సంబంధిత లవణాన్ని వినియోగించడం లేదని, అనుమానం ఉన్న వ్యక్తులు, శాస్త్రవేత్తలు ఆరు నెలల్లోగా దీనిని నిరూపించాలని, ఆ తరువాతే పీటీఎఫ్‌ఈ ఉత్పత్తి చేపడుతామని టీజీ వివరించారు. దేశంలో పీటీఎఫ్‌ఈ ఉత్పత్తి పరిశ్రమలు మూడు ఉన్నాయని, ఇళ్లలో వాడే నీటి పైపుల తయారీకి ప్రపంచంలో విస్తారంగా వినియోగిస్తున్నారని గుర్తు చేశారు. ఇక్కడ తయారయ్యే కార్బన్ టెట్రాక్లోరైడ్‌ను భారత ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి పొందిన వ్యవసాయ రసాయనాలు తయారీదారులకు మాత్రమే సరఫరా చేస్తున్నామని, ఇందుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని టీజీ పేర్కొన్నారు. తమ పరిశ్రమ పరిసర గ్రామాల్లో అవసరమైన మౌలిక, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా మన్నారు. వివిధ సామాజికవర్గాల అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు.