వరి, జొన్న రైతులను ఆదుకోండి
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:48 PM
వరి, జొన్న పంటలకు సరైన మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు.

సీఎంను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు
నంద్యాల ఎడ్యుకేషన్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): వరి, జొన్న పంటలకు సరైన మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు. మంగళవారం రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, గిత్తా జయసూర్య, గౌరు చరితారెడ్డి అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. నంద్యాల జిల్లాలో వరి, జొన్న పంట విస్తారంగా సాగుచేస్తారన్నారు. జొన్నకు ప్రస్తుతం క్వింటాకు రూ.2400 మాత్రమే చెల్లిస్తున్నారని, రూ.3,400కు మద్దతు ధర పెంచాలని, అలాగే వరి క్వింటానికి రూ.1,200 చెల్లిస్తున్నారని, క్వింటానికి రూ.1800 మద్దతు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రులు, ఎమ్మెల్యేలు తెలిపారు. అనంతరం వారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు.