Share News

ఏడాది అంతా మద్దతు ధర

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:37 AM

ఉల్లికి మద్దతు ధర రూ.1200 ఏడాది అంతా ఉంటుందని ఆర్డీవో సందీప్‌ కుమార్‌ అన్నారు.

 ఏడాది అంతా మద్దతు ధర
పంట నమోదును పరిశీలిస్తున్న ఆర్డీవో సందీప్‌ కుమార్‌

ఆర్డీవో సందీప్‌ కుమార్‌

కోడుమూరు రూరల్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఉల్లికి మద్దతు ధర రూ.1200 ఏడాది అంతా ఉంటుందని ఆర్డీవో సందీప్‌ కుమార్‌ అన్నారు. గురువారం వర్కూరులో పంట నమోదు, పంట నష్టం అంచనాపై తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా రైతు దాసప్ప పొలాన్ని సందర్శించారు. పంట పెట్టుబడి, దిగుబడి వివరాలు తెలుసుకున్నారు. కౌలు రైతు వెంకటేశ పొలంలో ఉల్లిపైరును పరిశీ లించారు. కనీసం 120 రోజుల తర్వాత కోత జరిపించాలని సూచిం చారు. బోరుబావుల కింద సాగు చేసిన ఉల్లి 80-90 రోజుల్లోగా కోత జరిపించాలని, లేకపోతే గడ్డ చీలికలు, కుళ్లు ఏర్పడుతుందని రైతులు ఆయనకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను రూ. 2 వేలకు పెంచితే నష్టాల నుంచి గట్టెక్కుతామని వివ రించారు. అనంతరం ఆర్డీవో కోడుమూరు వద్ద ఉల్లి ఆరబోసుకున్న రైతులతో మాట్లాడారు. వెంకటగిరిలో త్వరలో చేపట్ట బోయే రీసర్వే సందర్భంగా ప్రభుత్వ భూములు, సరిహద్దులు గుర్తించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నాగరాజు, మండల సర్వేయర్‌ ఈశ్వర్‌, ఆర్‌ఐ అశోక్‌, వీఆర్వోలు ఎల్లప్ప, పరమేష్‌, శ్రీనివాసులు, బీరప్ప పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 12:37 AM