మద్దతు ధర అందాలి: జేసీ కార్తీక్
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:32 PM
: రైతులకు కనీస మద్దతు ధర చెల్లిండంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జేసీ కార్తీక్ అధికారులను ఆదేశించారు.
నంద్యాల నూనెపల్లె, నవంబర్ 6 (ఆంధ్రజ్యోతి): రైతులకు కనీస మద్దతు ధర చెల్లిండంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జేసీ కార్తీక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. జేసీ కార్తీక్ మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకం వరికి రూ.2389, కామన్ రకం వరికి రూ.2369 చెల్లించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులకు ఎమ్‌ఎ్‌సపీ కంటే తక్కువ ధర చెల్లింపులు జరుగకుండా కఠినంగా పర్యవేక్షించాలన్నారు.