ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:46 AM
ట్రిపుల్ ఐటీడీఎం అభివృద్ధికి కృషి చేస్తాననీ కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు హామీ ఇచ్చారు.
ఎంపీ బస్తిపాటి నాగరాజు
కర్నూలు ఎడ్యుకేషన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ట్రిపుల్ ఐటీడీఎం అభివృద్ధికి కృషి చేస్తాననీ కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు హామీ ఇచ్చారు. బుఽధవారం జగన్నాథగట్టులోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. క్యాంపస్‌లోని డ్రోన్లను పరిశీలించారు. ఈ క్యాంపస్ సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రితో పాటు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వ పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఓర్వకల్లు వద్ద ఏర్పాటయ్యే డ్రోన్ల తయారీ పరిశ్రమను ట్రిపుల్‌ఐటీ కళాశాలలోని డ్రోన్ల ప్రవేశాలకు అనుసంధానం చేసేందుకు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాననీ ఎంపి తెలిపారు.