Share News

అన్న క్యాంటీన్లను పర్యవేక్షించాలి : కమిషనర్‌

ABN , Publish Date - Oct 01 , 2025 | 12:46 AM

నగరంలో ఉన్న 5 అన్న క్యాంటీన్లను కో ఆర్డినేటర్లు పర్యవేక్షించాలని నగర పాలక కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ ఆదేశించారు.

అన్న క్యాంటీన్లను పర్యవేక్షించాలి : కమిషనర్‌
క్యాంటీన్‌ను పరిశీలిస్తున్న కమిషనర్‌ విశ్వనాథ్‌

కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నగరంలో ఉన్న 5 అన్న క్యాంటీన్లను కో ఆర్డినేటర్లు పర్యవేక్షించాలని నగర పాలక కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ ఆదేశించారు. మంగళవారం పరిమళ నగర్‌, ప్రభుత్వ ఆసుపత్రి, సెట్కూరు కార్యాలయ సమీపంలోని క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజూ మూడు పూటలా తనిఖీ చేయాలని, ప్రజలకు అందించే భోజనం నాణ్యతో రాజీ పడవద్దన్నారు. సెంట్రల్‌ ప్లాజా వద్ద పెయింటింగ్‌ పనులను పరిశీలించి అక్కడ వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - Oct 01 , 2025 | 12:46 AM