సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయాలి: సీపీఐ
ABN , Publish Date - Jun 02 , 2025 | 11:48 PM
ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు రూరల్, జూన 2(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కర్నూలు అర్బన తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ధర్నా చేశారు. కార్యక్రమానికి సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు బీసన్న అధ్యక్షత వహించగా ముఖ్య అతిఽథిగా పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప పాల్గొని మాట్లా డారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలా లతోపాటు నిర్మాణం కోసం రూ.5లక్షలు ఇస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. అనంతరం అర్భన తహసీల్దార్ వెంకటలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి చంద్రశేఖర్, మహిళ సమైక్య నాయకురాలు గిడ్డమ్మ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి నాగరాజు, నగర కార్యవర్గ సభ్యులు ఈశ్వర్, నల్లన్న పాల్గొన్నారు.