Share News

ఎస్పీగా సునీల్‌ షెరాన్‌

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:59 PM

నంద్యాల ఎస్పీగా సునీల్‌ షెరాన్‌ను నియమిస్తూ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్పీగా సునీల్‌ షెరాన్‌

ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా

నంద్యాల, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): నంద్యాల ఎస్పీగా సునీల్‌ షెరాన్‌ను నియమిస్తూ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సునీల్‌ షెరాన్‌ 2019 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారు. మొదట ట్రైనింగ్‌ సమయం అనకాపల్లిలో చేశారు. ఆ తర్వాత పార్వతీపురం ఏఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని గ్రే హౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌గా పనిచేస్తూ నంద్యాల ఎస్పీగా నియమితులయ్యారు. ఆయన స్వస్థలం హర్యానా(ఢిల్లీ). సునీల్‌ షెరాన్‌ ఆదివారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఆయా పనుల్లో నిమగ్నమయింది. ప్రస్తుత ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా గత ఏడాది జూలై 15వ తేదిన బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం బదిలీ కావడంతో ఆశాఖ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేసుకోవాలని ఆదేశించారు.

Updated Date - Sep 14 , 2025 | 12:01 AM