సన్‌డే భగభగలు
ABN , Publish Date - May 05 , 2025 | 12:52 AM
ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆదివారం ఎండలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలోనే అనేక చోట్ల వర్షాలు కురిసినప్పటికీ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మాత్రం భానుడు భగ్గుమన్నాడు.
ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
పాణ్యం మండలంలో 42.66, వెల్దుర్తి మండలంలో 42.45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
నంద్యాల ఎడ్యుకేషన్, మే 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆదివారం ఎండలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలోనే అనేక చోట్ల వర్షాలు కురిసినప్పటికీ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మాత్రం భానుడు భగ్గుమన్నాడు. ఉమ్మడి జిల్లాల్లో అత్యధికంగా పాణ్యం మండలం గోనవరంలో 42.66 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాలలో 42.07, బనగానపల్లెలో 42.0, జూపాడుబంగ్లా 41.97. దొర్నిపాడు 41.84, గోస్పాడు 41.6, సంజామల 41.59, కోవెలకుంట్ల 41.42, నందికొట్కూరు 41.22, గడివేముల 41.2, ఆళ్లగడ్డ 41.12, బండిఆత్మకూరు 41.06, బేతంచర్ల 41.03, రుద్రవరం 40.97, డోన్ 40.9, శిరువెళ్ల 40.87, కొలిమిగుండ్ల 40.5, కొత్తపల్లె 40.4, చాగలమర్రి 40.15, అవుకు 39.85, పాములపాడు 39.79 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ సంస్థ వెల్లడించింది.
కర్నూలు జిల్లాలో
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కలుగొట్లలో 42.45డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోడూమూరు 42.4, కర్నూలునగరం 41.42, సి.బెళగల్ 41.09, మంత్రాలయం 40.79, కల్లూరు 40.77, కోసిగి 40.5, నందవరం 40.4, ఓర్వకల్ 40.29, క్రిష్ణగిరి 40.2, దేవనకొండ 39.89, గోనెగండ్ల 39.79, యమ్మిగనూరు 39.7, ఆస్పరి 39.4 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైనట్లు వాతావరణ సంస్థ వెల్లడించింది.