Share News

అన్నదాతకు అండగా ‘సుఖీభవ’

ABN , Publish Date - Jul 31 , 2025 | 11:58 PM

అన్నదాతకు‘సుఖీభవ’ పథకం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

అన్నదాతకు అండగా ‘సుఖీభవ’
కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ రాజకుమారి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

నంద్యాల ఎడ్యుకేషన్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): అన్నదాతకు‘సుఖీభవ’ పథకం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని కలెక్టర్లు, వ్యవసాయా ధికారులతో గురువారం ‘అన్నదాత సుఖీభవ’పై వర్చువల్‌గా సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ రాజకుమారి, జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లుతో పాటు వ్యవసాయాధికారులు హాజ రయ్యారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవ పథకం అందిస్తున్నామని, అర్హులైన ప్రతి రైతు ఖాతాలో నగదు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ ఒక్క రైతు నుంచి ఫిర్యాదు రాకుండా చూడాలన్నారు. నంద్యాల జిల్లాలో 2.07 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని, రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో రూ.5వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌యోజన పథకం ద్వారా రూ.2వేలు కలిపి మొత్తం రూ.7వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. ఈకేవైసీ పెండింగ్‌ లేకుండా చూడాలని, ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు.

అధికారులతో సీఎస్‌ సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ గురువారం వర్చువల్‌గా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 2వ తేదీన ప్రకాశం జిల్లా దర్శిలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్ట ర్‌ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకా న్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కార్య క్రమ నిర్వహణను అధికారులు ఎలాంటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టే పీ4 కార్యక్రమానికి సం బంధించి మార్గదర్శకులు దారిద్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలను దత్త త తీసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఆగస్టు 15వ తేదీ నాటికి నిర్ణీత లక్ష్యాలను అధిగమించి జిల్లాకు మంచి పేరు తీసుకరావాలని కోరారు.

Updated Date - Jul 31 , 2025 | 11:58 PM