Share News

సుకన్య సమృద్ధి పథకాన్ని వినియోగించుకోవాలి

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:31 AM

ఆడపిల్ల తల్లిదండ్రులు సుకన్యా సమృద్ధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల పోస్టల్‌ సూపరిండెంట్‌ అప్పలస్వామి సూచించారు.

సుకన్య సమృద్ధి పథకాన్ని వినియోగించుకోవాలి
ఉద్యోగులకు బహుమతులు అందజేస్తున్న పోస్టల్‌ సూపరింటెండెంట్‌

నంద్యాల పోస్టల్‌ సూపరింటెండెంట్‌ అప్పలస్వామి

ఆళ్లగడ్డ, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఆడపిల్ల తల్లిదండ్రులు సుకన్యా సమృద్ధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల పోస్టల్‌ సూపరిండెంట్‌ అప్పలస్వామి సూచించారు. శనివారం స్థానిక పోస్టాఫీసులో ఆరునెలల లావాదేవీలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రసంగించారు. ఆళ్లగడ్డ సబ్‌డివిజన రిజియనలో మంచి ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో పని చేయాలన్నారు. అనంతరం పోస్టాఫీసులో అత్యుత్తమ ఫలితాలు సాధించిన రంజితకుమార్‌ నాయక్‌, గురువయ్య, కరిముల్లా, రమణయ్య, బాలన్నలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ పోస్టల్‌ ఇనస్పెక్టర్‌ రామనాథ్‌, మేనేజర్‌ శ్రీనివాసులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 12:31 AM