ప్రశాంతతతోనే విజయం సాధ్యం
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:24 AM
మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే విజయం సాధ్యమవుతుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్ డాక్టర్ శశికళ అన్నారు.
నంద్యాల ఎడ్యుకేషన, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే విజయం సాధ్యమవుతుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్ డాక్టర్ శశికళ అన్నారు. మానసిక ఒత్తిడి- మానసిక ఆరోగ్యంపై మంగళవారం కళాశాలలో విద్యార్థులకు నిపుణుల చేత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జీవితంలో కోరుకున్న లక్ష్యాలను చేరుకోలేక అనే మంది మానసిక ఒత్తిడిలకు గురవుతున్నారని, తద్వారా ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ సమ స్యకు అయినా పరిష్కారం తప్పక ఉంటుందని, తోటివారితో పం చుకోవడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. అనంతరం మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ శరతచంద్ర విద్యార్థులకు మానసిక ఒత్తిళ్లను ఏ విధంగా ఎదు ర్కోవాలో వివరించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.