వరండా చదువులు
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:57 AM
: గత ప్రభుత్వం నాడు-నేడు కింద చేపట్టిన అదనపు గదుల నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు వరండాల్లోనే విద్యనభ్యసిస్తున్నారు
పెండేకల్ పాఠశాలలో పూర్తికాని అదనపు తరగతి గదులు
తుగ్గలి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం నాడు-నేడు కింద చేపట్టిన అదనపు గదుల నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు వరండాల్లోనే విద్యనభ్యసిస్తున్నారు. మండలంలోని పెండేకల్ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు దాదాపు 220 మంది విద్యార్థులు చదువుతున్నారు. గదులు తక్కువగా ఉండటంతో గత ప్రభుత్వ హయాంలో నాలుగు అదనపు గదుల నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు పూర్తి కాలేదు. దీంతె విద్యార్థులను వరండాలో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి తరగతి గదుల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.