విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచాలి
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:52 AM
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సామర్థ్యాలను పెంచాలని నంద్యాల డిప్యూటీ డీఈవో శంకరప్రసాద్ అన్నారు.
చాగలమర్రి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సామర్థ్యాలను పెంచాలని నంద్యాల డిప్యూటీ డీఈవో శంకరప్రసాద్ అన్నారు. శుక్రవారం చాగలమర్రి సేయిం ట్ ఆన్స ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థి అలిఅక్బర్‌ను ఓ టీచర్ కర్రతో కొట్టిన విషయంపై విచారణ చేశారు. ఉపాధ్యాయులు, పది విద్యార్థులు తల్లిదండ్రులతో విచారణ నిర్వహించారు. డిప్యూటీ డీఈవో మాట్లాడూతు విద్యా ర్థులను కర్రలతో కొట్టకూడదని అన్నారు. విచారణ నివేదికలను ఆర్ జేడీకీ పంపి స్తామన్నారు. ఆయన వెంట హెచఎం స్మిత, ఎంఈవోలు అనూరాధ, న్యామతుల్ల ఉన్నారు.