Share News

విద్యార్థులను సాంకేతికంగా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Oct 23 , 2025 | 10:37 PM

మారు తున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సాంకేతికంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

విద్యార్థులను సాంకేతికంగా తీర్చిదిద్దాలి
విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేస్తున్న మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల ఎడ్యుకేషన్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మారు తున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సాంకేతికంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. నంద్యాల మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ మైనార్టీస్‌ ఆధ్వర్యంలో ఉర్దూ మీడియం పదో తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్‌ పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, డీఈవో జనార్దన్‌రెడ్డి పాల్గొని విద్యార్థులకు మెటీరియల్‌ను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ టెక్నాలజీని విద్యార్థులకు సబ్జెక్టు వారీగా బోధించాలని, వారికి కనీస కంప్యూటర్‌ పరిజ్ఞానం అవస రమని అన్నారు. త్వరలో స్థానిక ఉర్దూ భవన్‌లో మైనార్టీ సంక్షేమ శాఖ తరపున కంప్యూటర్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి మంచి ఫ్యాకల్టీతో ఉచిత కంప్యూటర్‌ శిక్షణా తరగతులు ప్రారంభిస్తామన్నారు.

మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన మంత్రి

మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మఽఽ ద్యాహ్న భోజన నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, నాణ్యతలో లోపాలున్నా ఉపేక్షించమన్నారు. ఈ కార్యక్రమంలో సీఈడీఎమ్‌ డైరక్టర్‌ యూకూబ్‌భాషా, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఉర్దూ అస్మదుద్దీన్‌, హెచ్‌ఎం అసదుల్లా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 10:37 PM