Share News

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్‌ఎఫ్‌

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:16 PM

రాష్ట్ర వ్యాప్తంగా వసతి గృహాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి.వలరాజు, బందెల నాసర్‌జీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

 విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్‌ఎఫ్‌
కర్నూలులో చండ్రరాజేశ్వరరావు భవన్‌కు చేరుకున్న ఏఐఎస్‌ఎఫ్‌ బస్సు జాతా

కర్నూలు ఎడ్యుకేషన్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా వసతి గృహాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి.వలరాజు, బందెల నాసర్‌జీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గత నెల ప్రారంభమైన బస్సు జాతా ఆదివారం కర్నూలు చేరు కుంది. బస్సు జాతాకు ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు పూలమాలలు వేసి స్వాగ తం పలికారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ ఆఫీస్‌ బేరర్‌ మస్తాన్‌, ఫణీంద్ర, చలపతి, నాగభూషణం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమన్న, షాభీర్‌ బాషా, జిల్లా కార్యదర్శి శరత్‌ కుమార్‌, నగర కార్యదర్శి అశోక్‌, మధు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2025 | 11:16 PM