Share News

విద్యార్థులు సరికొత్తగా ఆలోచించాలి

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:54 PM

విద్యార్థులు నిత్యం సరి కొత్తగా ఆలోచించాలని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ సూచించారు.

విద్యార్థులు సరికొత్తగా ఆలోచించాలి

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ అభివృద్ధి చెందుతోంది

ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ నారాయణన్‌

ఘనంగా కర్నూలు ఐఐఐటీ డీఎం 7వ స్నాతకోత్సవం

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు నిత్యం సరి కొత్తగా ఆలోచించాలని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ సూచించారు. కర్నూలు నగ రం సమీపంలోని జగన్నాథగట్టుపై ఉన్న భారత సమాచార సాంకేతికత, రూపకల్పన, తయారీ సంస్థ (ఐఐఐటీడీఎం) 7వ స్నాతకోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నారాయణన్‌ హాజరై ప్రసం గించారు. దేశంలో శాస్త్రీయ అభివృద్ధిని గ్రామీణాభివృద్ధితో అ నుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్రం అనంతరం భారత్‌ విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో సాధించిన అసాధారణ విజయాల గురించి ఆయన వివరించారు. 104 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడం భారత్‌ సా మర్థ్యానికి నిదర్శనమని అన్నారు. సమాచార రంగంలో జరిగిన అభివృద్ధిలో దేశపు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచాయన్నారు. వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో దేశం సాధించిన పురోగతి గురించి వివరించారు. ప్రస్తుతం భారత ఆహార ధా న్యాలను ఎగుమితి చేసే స్థాయికి చేరిందని, మెడికల్‌ టెక్నాలజీలో విప్లవాత్మక అభివృద్ధి జరుగుతోందని వివరించారు.సమగ్ర అభివృద్ధి కోసం ఇంజనీరింగ్‌ విద్యార్థులు తమ జ్ఞానాన్ని గ్రామాభివృద్ధికి మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులు మాతృభూమికి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధ్యాపకులు విద్యార్థుల్లో పరిశోధనా స్ఫూర్తిని, నవీ నా ఆలోచనల అభివృద్ధిని పెంపొందించాల్సిన బాధ్యత కలిగి ఉ న్నారని తెలిపారు. ఐఐఐటీడీఎం కర్నూలుపై తన ఆశయాలను వెల్లడించిన ఆయన ఈసంస్థ త్వరలోనే దేశంలోనే అగ్రగామి విద్యా, పరిశోధన సంస్థల్లో ఒకటిగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునికీకరణ, పరిశోధనపై భారత్‌ ప్రత్యేక దృష్టి పెట్టిం దని, దీంతో 2047నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చే శారు. సంస్థ చైర్‌పర్సన్‌ దేశ్‌మాని విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచస్థాయి సదుపాయాలను అందించడంలో బోధన, పరిశోధనలలో నవీనతను ప్రోత్సహించడంలో తమ సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు. ఐఐఐటీడీఎం విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరుస్తున్నారని ఆమె తెలిపారు. ఈ సంస్థను పరిశోధన, వినూత్నతలో కేంద్రంగా అభివృద్ధి చేయడమే తమ దృష్టికోణమని చెప్పారు. డైరెక్టర్‌ ప్రొ.బీఎస్‌ మూర్తి మాట్లాడుతూ డిగ్రీ ఒకటే కాదని, దేశానికి అవసరమైన యాక్టివిటీస్‌, ప్రాజెక్టులు, నాయకత్వ లక్షణాలతో ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా రాణించేలా విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. గేట్‌ ప్రవేశ పోటీ పరీక్షలో 200లోపు ర్యాంకులు వచ్చిన వారు కర్నూలు ఐఐఐటీడీఎంలో ప్రవేశాలు తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే కర్నూలు విద్యాసంస్థ డ్రోన్‌ టెక్నాలజీలో ముందంజలో ఉందన్నారు. తమ విద్యాసంస్థలో పని చేస్తున్న 44 మంది బోధన అధ్యాపకులు వివిధ పరిశోధనలు విస్తృతంగా పని చేస్తున్నారని అన్నారు. చదువుతో పాటు పరిశోధనల వైపు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. విద్య ఒక్కటే కాదు.. స్పోర్ట్స్‌ మీట్‌లో 36 మెడల్స్‌, టోర్నమెంట్స్‌ మెన్స్‌ విభాగంలో 49 మెడల్స్‌ సాధించారన్నారు.

206 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం

అనంతరం 206 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌తో పాటు బోర్డు చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, డైరెక్టర్‌ ప్రొ.బీఎస్‌ మూర్తి చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఇందులో 183 మందికి బీటెక్‌, 19 మందికి ఎంటెక్‌, నలుగురికి పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ డైరెక్టర్‌ జీవీఎల్‌ సోమయాజులు, రిజిస్ట్రార్‌ గురుమూర్తి, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:54 PM