ఎస్‌ఐ సార్.. మా ఊరి బస్సు రాలేదు
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:41 PM
మండలంలోని ముద్దటమాగి గ్రామానికి చెందిన 50 మంది విద్యార్థులు తమ ఊరి బస్సు రాలేదని హొళగుంద పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు
హొళగుదం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ముద్దటమాగి విద్యార్థులు
పోలీస్ వాహనంలో విద్యార్థులను పంపిన ఎస్‌ఐ గురజాల దిలీప్
హొళగుంద, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ముద్దటమాగి గ్రామానికి చెందిన 50 మంది విద్యార్థులు తమ ఊరి బస్సు రాలేదని హొళగుంద పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తాము హొళగుంద జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నామని, రోజూ బస్సులోనే వెళతామన్నారు. కాగా ఈరోజు బస్సు రాలేదని ఎస్‌ఐ గురజాల దిలీప్ కుమార్‌కు సమస్యను తెలిపారు. స్పందించిన ఎస్‌ఐ ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేయగా అరగంటలో వస్తుందని చెప్పగా సాయంత్రం 7గంటల వరకు వేచి చూసినా, రాకపోవడంతో పోలీస్ వాహనంలో విద్యార్థులను వారి గ్రామానికి పంపించారు. దీంతో ఎస్‌ఐని గ్రామస్థులు అభినందించారు. ఈ విషయంపై డీఎం మహమ్మద్ రఫీని సంప్రదించగా సరైన సమాధానం ఇవ్వలేదు.