Share News

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమమానికి కృషి

ABN , Publish Date - Jul 28 , 2025 | 10:54 PM

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అన్నారు.

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమమానికి కృషి
విభిన్న ప్రతిభావంతులకు డైసీ మెషిన్‌ను అందజేస్తున్న కలెక్టర్‌

కర్నూలు కలెక్టరేట్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పరిపూర్ణ అధ్యయన సాధనంతో పూర్తిగా మాట్లాడే పాకెట్‌ లైబ్రరీ (డైసీ మెషిన్‌)ను కలెక్టర్‌ విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు అందజేశారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల జిల్లా కోఆర్డినేటర్‌ లాగిన్‌లో వారం రోజులు, డీఎ్‌సడీవో లాగిన్‌లో 13 రోజుల నుంచి అర్జీలు, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే కర్నూలు లాగిన్‌లో 11 రోజులు, కర్నూలు అర్బన్‌ తహసీల్దార్‌ లాగిన్‌లో వారం రోజుల నుంచి ఒక అర్జీ, ఆదోని సబ్‌ రిజిస్ర్టార్‌ లాగిన్‌లో వారం రోజుల నుంచి అర్జీలు చూడకుండా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సీఎంవో గ్రీవెన్స్‌కు సంబంధించి ఆదోని సబ్‌ కలెక్టర్‌ వద్ద 13, పత్తికొండ ఆర్డీవో వద్ద 6, కర్నూలు ఆర్డీవో వద్ద 7, సర్వే ఏడీ, డీఎ్‌సడీవో, కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌, డీఆర్‌డీఏ పీడీ, హౌసింగ్‌ పీడీ, మెఫ్మా పీడీ, ఇరిగేషన్‌ ఎస్‌ఈ, వక్ఫ్‌బోర్డుల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని గడుపులోపు పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ డా.బి.నవ్య, డీఆర్వో వెంకటనారాయణమ్మ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2025 | 10:55 PM