సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:15 AM
ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని ఏపీ మున్సి పల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన నగర అధ్యక్షుడు వెంకటే శ్వర్లు హెచ్చరించారు.
కర్నూలు న్యూసిటీ, జూన 19(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని ఏపీ మున్సి పల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన నగర అధ్యక్షుడు వెంకటే శ్వర్లు హెచ్చరించారు. గురువారం నగరపాలక కమిషనర్ రవీంద్రబాబును ఆయన చాంబర్‌లో కలిసి తమ సమస్యలను వివరించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కమిషన ర్‌ను కోరామన్నారు. జిల్లా అధ్యక్షుడు మనోహర్, రాష్ట్ర కోశాధికారి సమీర్ బాషా, ఉపాధ్యక్షుడు నాగశేషులు, కార్యదర్శి యాసినబేగ్ పాల్గొన్నారు.