Share News

ప్లాస్టిక్‌ నిషేధాన్ని పకడ్బందీగా అమలుచేయండి

ABN , Publish Date - Jul 29 , 2025 | 10:39 PM

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి డా.పి.కృష్ణయ్య అధికారులను ఆదేశించారు.

ప్లాస్టిక్‌ నిషేధాన్ని పకడ్బందీగా అమలుచేయండి
మాట్లాడుతున్న డాక్టర్‌ పి.కృష్ణయ్య

గుడ్డ సంచులు, జ్యూట్‌ బ్యాగ్‌లు వాడండి

ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ డాక్టర్‌ పి.కృష్ణయ్య

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై చర్యలు తీసుకుంటాం

కలెక్టర్‌ రంజిత్‌బాషా

కర్నూలు కలెక్టరేట్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి డా.పి.కృష్ణయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధంపై కలెక్టర్‌ రంజిత్‌బాషాతో కలిసి స్టేక్‌ హోల్డర్‌ విభాగాలతో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఎక్కువ జనాభా ఉండే ప్రాంతాల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించేలా చర్యలు తీసుకోవాల న్నారు. ఈ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వాడకానికి ప్రత్యామ్నాయంగా గుడ్డసంచులు, జ్యూట్‌ బ్యాగులు అమ్మేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా మాట్లాడుతూ జిల్లాలో అక్టోబరు 2వ తేదీ నాటికి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ కిషోర్‌రెడ్డి, కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 10:39 PM