ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు
ABN , Publish Date - Jun 26 , 2025 | 12:49 AM
ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత పాటిల్ తెలిపారు.
22 నూతన ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ
కర్నూలు క్రైం, జూన 25(ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత పాటిల్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన 2 బుల్లెట్ వాహనాలు, 20 అపాచి వాహనాలను ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ మంగళగిరి నుంచి వచ్చిన ఈ వాహనాలను సైరన, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారన్నారు. జిల్లాలోని కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు ఈ వాహనాలు కేటాయిస్తామన్నారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినప్పుడు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఎక్కడైనా ఓవర్ లోడింగ్, రాంగ్‌రూట్, వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే వారి ఫొటోలను తీసి వాట్సాప్‌కు పంపిస్తే అటువంటి వారిని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లకు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇవ్వడం, జరిమానా విధిస్తామ న్నారు. అనంతరం డీవీఆర్ గ్రూప్స్ అధినేత డి.వెంకటేశ్వరరెడ్డి జిల్లా పోలీసు శాఖకు డీజే డ్రోన కెమెరాను అందజేశారు. కార్యక్రమంలో సదరన రీజియన హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్, ఏఆర్ అడిషినల్ ఎస్పీ కృష్ణమోహన, డీఎస్పీలు బాబు ప్రసాద్, బాస్కర్‌రావు, ప్రసాద్, సీఐలు తేజమూర్తి, మన్సూరుద్దీన, అబ్దుల్‌గౌస్, నాగరాజరావు, రామానాయుడు, ఆర్‌ఐలు నారాయణ, జావేద్, సోమశేఖర్ నాయక్, ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ హుశేన, కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.