Share News

భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:34 PM

చామకాల్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ కార్తీక్‌ హెచ్చ రించారు.

భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు
చామ కాల్వ భూమిని పరిశీలిస్తున్న జేసీ కార్తీక్‌

జేసీ కార్తీక్‌

నంద్యాల టౌన్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): చామకాల్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ కార్తీక్‌ హెచ్చ రించారు. శనివారం చామకాల్వను అనుకుని ఉన్న భూమిని ఆయన పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ అక్రమణకు గురి అయిందన్న ఫిర్యాదు మేరకు పరిశీలించినట్లు తెలిపారు. చామకాల్వకు రక్షణ గోడ నిర్మించాల ని ఆదేశించారు. మున్సిపల్‌ కార్యాలయం వెనుక ఉన్న 50 సెంట్ల స్థలా న్ని పరిశీలించారు. స్థలాన్ని ఇస్కాన్‌ టెంపుల్‌ వారు అడిగారన్నారు. స్థలానికి సంబంధించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆయన వెంట తహసీల్దారు శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:34 PM