Share News

రెడ్‌క్రాస్‌ను బలోపేతం చేయండి

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:48 PM

జిల్లాలో రెడ్‌క్రాస్‌ను బలోపేతం చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాలలోని రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ స్టోరేజ్‌ సెంటర్‌లో నంద్యాల జిల్లా నూతన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

రెడ్‌క్రాస్‌ను బలోపేతం చేయండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

రక్తదానంపై అవగాహన కల్పించాలి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల హాస్పిటల్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెడ్‌క్రాస్‌ను బలోపేతం చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాలలోని రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ స్టోరేజ్‌ సెంటర్‌లో నంద్యాల జిల్లా నూతన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ జిల్లాలో రక్తం కొరత రాకుండా రక్తదానంపై అవగాహన కార్యక్ర మాలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో జూని యర్‌ రెడ్‌క్రాస్‌ యూనిట్లను ప్రతి కళాశాలలో యూత్‌ రెడ్‌క్రాస్‌ బృం దాలను ఏర్పాటుచేసి లక్ష మంది విద్యార్థులను సభ్యులుగా నమోదు చేయా లన్నారు. విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై శిక్షణ ఇచ్చి రెడ్‌క్రాస్‌ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యుల సహకారంతో గిరిజన ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చైర్మన్‌ దస్తగిరి, వైస్‌ చైర్మన్‌ డా.మమతారెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, కార్యవర్గసభ్యులు డా.నిశితారెడ్డి, డా.అరుణకుమారి, ఉస్మాన్‌ బాషా, నరసింహమూర్తి, రాధాకృష్ణ, యాకూబ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 11:48 PM