పార్టీని బలోపేతం చేయండి
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:45 PM
తెలుగుదేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్, నియోజకవర్గం టీడీపీ పరిశీలకుడు నటేశ చౌదరి అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్
బనగానపల్లె, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్, నియోజకవర్గం టీడీపీ పరిశీలకుడు నటేశ చౌదరి అన్నారు. గురువారం బనగానపల్లె పట్టణంలోని జీఎంఆర్ పంక్షన హాల్‌లో నియోజకవర్గంలో నూతనంగా ఎంపికైన మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత కమిటీల ప్రమాణ స్వీకారాన్ని మల్లె ల రాజశేఖర్‌గౌడ్, సీనియర్ టీడీపీ నాయకులు కాటసాని చంద్రశేఖ ర్‌రెడ్డి, జిల్లెళ్ల రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసంద ర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లె ల్ల రాజశేఖర్‌రెడ్డి, మల్లెల రాజశేఖర్‌గౌడ్‌లు పార్టీ జెండాను ఆవిష్క రించి మాట్లాడారు. కార్యకర్తలకు ఎల్లాప్పుడు టీడీపీ అండగా ఉం టుందన్నారు. ఈసందర్భంగా బనగానపల్లె మండల టీడీపీ అధ్యక్షు డిగా పీవీ.కుమార్‌రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా కాశీంబాబు, అవుకు మండల టీడీపీ అధ్యక్షుడిగా ఉగ్రసేనా రెడ్డి, కొలిమిగుండ్ల మండల టీడీపీ అధ్యక్షుడిగా మూలే రామేశ్వరరెడ్డి, సంజామల టీడీపీ అధ్యక్షుడిగా ఎగ్గోనికి చెందిన తరి పోగుల విష్ణువర్దనరెడ్డి, కోవె లకుంట్ల మండల టీడీపీ అధ్యక్షుడిగా అమడాల మద్దిలేటి, తదితర క్లస్లర్, యూనిట్, బూత, గ్రామ స్థాయి కమిటీ సభ్యులచే జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌రెడ్డి, నియోజకవర్గం పరిశీలకులు నటేశ చౌదరి ప్రమాణ స్వీకారం చేయిచారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కుడు కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, బనగానపల్లె మార్కెట్‌యార్డు చైర్మన కాట్రెడ్డి మల్లిఖార్జునరెడ్డి, అమర్‌నాథరెడ్డి, ఉపసర్పంచ బురా నుద్దీన, గండం మల్లిఖార్జునరెడ్డి, మిట్టపల్లె సర్పంచ తులసిరెడ్డి, అబ్దుల్‌కలాం, రాయల సీమ సలాం, బెలుం సురేశరెడ్డి, కోటపాడు శివరామిరెడ్డి, అంకిరెడ్డిపల్లె రవిప్రకాశరెడ్డి పాల్గొన్నారు.