Share News

రాష్ట్రంలో బీజేపీ బలోపేతం

ABN , Publish Date - Jul 23 , 2025 | 11:32 PM

రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతోందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమగుట్ట విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో బీజేపీ బలోపేతం
మాట్లాడుతున్న విష్ణువర్దన్‌ రెడ్డి

రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌ రెడ్డి

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతోందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమగుట్ట విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం కర్నూలు నగరంలోని మౌర్యఇన్‌ హోటల్‌లోని పరిణయహాలులో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీ ఎన్‌ మా ధవ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి పర్యటన రాయలసీమలో ఉండబోతోందన్నారు. ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కడపకు చేరుకుని 27న కడప జిల్లాలో పర్యటిస్తారన్నారు. అలాగే 28న నంద్యాల, 29న కర్నూలులో పర్యటి స్తారన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. టీటీడీలో పని చేసే ఇతర అన్యమతస్థులు స్వచ్ఛం ధంగా ఉద్యోగాల నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ జలాల విషయంలో లేనివివాదాలు సృష్టిస్తోందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌నాయుడు, బీజేవైఎం సురేష్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరాజు యాదవ్‌, పురు షోత్తంరెడ్డి, ప్రేమ్‌ కుమార్‌, రామస్వామి, మదనమోహన్‌ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 11:32 PM