గాలివాన బీభత్సం
ABN , Publish Date - May 19 , 2025 | 12:46 AM
మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది.
దెబ్బతిన్న అరటి, మునగ, మామిడి తోటలు
రూ.లక్షల్లో నష్టం
ఓర్వకల్లు, మే 18(ఆంధ్రజ్యోతి): మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఈ దురు గాలులకు మామిడి, అరటి, మునగ తోటలు భారీగా దెబ్బతి న్నాయి. దీంతో రైతులు, కౌలు రైతులు కన్నీరు పెడుతున్నారు. రూ.లక్షల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. మండలంలోని సోమ యాజులపల్లె, కాల్వబుగ్గ, కాల్వ, చెన్నంచెట్టిపల్లె, కొమరోలు, సోమయా జులపల్లె గ్రామాల్లో అరటి, మునగ పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే పాలకొలను, బేతంచెర్ల మండ లంలోని ఎంబాయి, మండ్లవానిపల్లె, రుద్రవరం తదితర గ్రామాల్లో మామిడి కాయలు నేలపాలయ్యాయి. పంటపై పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులను ప్రభు త్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తీవ్రంగా నష్టపోయాం
తాను రెండెకరాల్లో అరటి, ఎకరా పొలంలో ము నగ పంట సాగుచేశా. గాలి, వానకు చెట్లు నేల కూలాయి. దీంతో తీవ్ర నష్టం సంభవించింది. ఎన్న డూ లేనివిధంగా ఈ ఏడాది అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు.
- ఆకుల వెంకటరెడ్డి, రైతు
ప్రభుత్వం ఆదుకోవాలి
మండలంలోని సోమయాజులపల్లె, కొమ రోలు, చెన్నంచెట్టిపలె, వెంకటాపురం గ్రామాల్లో గాలి వానకు అరటి, మునగ పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. రైతులు తీవ్రంగా నష్టపో యారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
- బోయ మనోహర్, రైతు