ఆధునిక కాలానికి అనుగుణంగా కథలు రావాల్సిన అవసరం ఉంది
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:58 AM
ఆధునిక కాలానికి అనుగుణంగా కథలు రావాల్సిన అవసరం ఉందని ప్రముఖ కథారచయిత ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు అన్నారు.
కర్నూలు కల్చరల్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆధునిక కాలానికి అనుగుణంగా కథలు రావాల్సిన అవసరం ఉందని ప్రముఖ కథారచయిత ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం రాత్రి టీజీవీ కళా క్షేత్రంలో కథా రచయితల సమావేశం జరిగింది. ఇందులో కథా రచయిత లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యం పెరిగిన రోజుల్లో కథలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్య జనులకు అతి దగ్గరగా ఉండే సాహితి ప్రక్రియ కవిత అని తెలిపారు. దీంతో పాటు కథ విశేష ఆదరణ కలిగిందన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన కథను నేటి యువతరానికి చేర్చాల్సిన బాధ్యత కూడా రచయితలపై ఉందన్నారు. అనం తరం అనేక మంది రచనలపై చర్చాగోష్టి జరిగింది. జిల్లా కో ఆపరేటివ్ అధికారి జి.వెంకట కృష్ణతోపాటు రచయితలు డా.ఎం.హరికిషన, మారుతి పురోహితం, వెంకటేశ్వరరెడ్డి, ఇనయతుల్లా, తెలుగు వెంకటేశ, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య పాల్గొన్నారు.