Share News

మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట

ABN , Publish Date - Jul 25 , 2025 | 12:17 AM

మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట వేయాలని కర్నూలు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ తెలిపారు.

మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట
‘డ్రగ్స్‌ వద్దు బ్రో’ పోస్టర్లను విడుదల చేస్తున్న డీఐజీ, ఎస్పీ

నేర నియంత్రణకు కృషి చేయాలి

నేర సమీక్షలో డీఐజీ

ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రశంసాపత్రాలు

కర్నూలు క్రైం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట వేయాలని కర్నూలు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయం లోని వ్యాస్‌ ఆడిటోరియంలో జిల్లా ఎస్పీతో కలిసి డీఐజీ కోయ ప్రవీణ్‌ జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష సమవేశం నిర్వహించారు. అనంతరం పెండింగ్‌ కేసుల గురించి ఆరా తీశారు. శాంతిభద్రతలను పరీరక్షణలో భాగంగా పోలీసులు సీరియస్‌గా పని చేస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఉండదని తెలిపారు. జిల్లాల విభజన తర్వాత కర్నూలు రేంజ్‌లో జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం ఉందన్నారు. పాత కక్షలు లేకుండా అందరికీ కౌన్సెలింగ్‌ చేయాలన్నారు. అలాగే ఎక్కడైనా అల్లర్లు జరగకుండా, ఓపెన్‌ డ్రింకింగ్‌ వంటివి లేకుండా డ్రోన్‌ కెమెరాలతో నిఘాతో విజిబుల్‌ పోలిసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌లను ఆశ్రయిస్తే న్యాయం జరిగేలా పని చేయాలన్నారు. సాంకేతిక నైపుణ్యం బాగా పెంచు కోవాలని డీఐజీ సూచించారు. అనంతరం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ సాంకేతికతను వినియోగించి నేరాల కట్టడికి బాగా పని చేయాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌ల పరిధుల్లో సీసీ కెమెరాల పనితీరు సక్రమంగా ఉండాలన్నారు. అవసరమైన చోట పీడీ యాక్టులు, బైండోవర్లు, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ చేయాలని ఆదేశించారు. డ్రంకెన్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌, యాంటీ ఈవ్‌ టీజింగ్‌ తనిఖీలను డ్రోన్‌ కెమెరాలతో ఇంకా మెరుగు పరుచుకోవాలన్నారు. ప్రాపర్టీ కేసులలో రికవరీలు చేయానలి, ప్రాపర్టీ కేసులలో నిందితుల వేలిముద్రలను సేకరించి చేధిం చాలన్నారు. కోర్టుల్లో ఉన్న పెండింగ్‌ కేసులను త్వరగా ట్రయల్‌కు వచ్చే విదంగా కృషి చేయాలన్నారు. ఫోక్సో కేసుల గురించి ఆరా తీశారు. అనంతరం గత నెలలో వివిధ కేసుల్లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈగల్‌ టీం ఆధ్వర్యంలో ‘గంజాయికి డ్రగ్స్‌కి గుడ్‌బై చెబుదాం, డ్రగ్స్‌ వద్దు బ్రో.. మాదక ద్రవ్యాల వినియోగాన్ని కట్టడి’ చేయాలనే కరపత్రాలను డీఐజీ, ఎస్పీ ఆవిష్కరించారు. జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు టోల్‌ఫ్రీ నెంబర్‌.1972కు సమాచారం అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏఎస్పీలు హుస్సేన్‌ పీరా, కృష్ణమోహన్‌, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జునరావు, డీఎస్పీలు బాబు ప్రసాద్‌, వెంకట్రామయ్య, శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు, హేమలత, ఏఆర్‌డీఎస్పీ భాస్కర్‌రావు, సీఐలు, ఎస్‌ఐలు, ఈగల్‌ టీం ఎస్‌ఐ సుజన్‌ కుమార్‌, ఈగల్‌ టీం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 12:17 AM