Share News

కర్ణాటక మద్యాన్ని అడ్డుకోండి

ABN , Publish Date - May 24 , 2025 | 01:01 AM

కర్ణాటక మద్యం రవాణాను అడ్డుకోవాలని నిఘా పెంచాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌శర్మ ఆదేశించారు.

కర్ణాటక మద్యాన్ని అడ్డుకోండి
మాట్లాడుతున్న డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌శర్మ

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌శర్మ

ఆలూరు, మే 23 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక మద్యం రవాణాను అడ్డుకోవాలని నిఘా పెంచాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌శర్మ ఆదేశించారు. గురువారం రాత్రి హాలహర్వి మంలం క్షేత్రగుడి చెక్‌పోస్టును తనిఖీ చేసి, సీసీ కెమెరాలను పరిశీలంచారు. అనంతరం ఆలూరు ఎక్సైజ్‌ స్టేషన్‌లో మాట్లాడుతూ నవోదయం 2.0లో భాగంగా సారాను నిర్మూలించాలన్నారు. డి.సి. శ్రీదేవి, ఎ.సి.హనుమంతరావు, సూపరింటెండెంట్‌ సుధీర్‌బాబు, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రామకృష్ణ, సీఐ లలిత ఉన్నారు.

Updated Date - May 24 , 2025 | 01:01 AM