రాతి సమాధులను పరిరక్షించుకోవాలి
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:48 PM
తిమ్మప్పకొండలో ఉన్న పూర్వకాలం నాటి రాతి సమాధులను స్థానికులు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ట్రైనింగ్ రిటైర్డు లైఫ్ మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ జీఎస్.రామయ్య శర్మ పేర్కొన్నారు.
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ట్రైనింగ్ రిటైర్డు లైఫ్ మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ జీఎస్. రామయ్య శర్మ
కోసిగి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తిమ్మప్పకొండలో ఉన్న పూర్వకాలం నాటి రాతి సమాధులను స్థానికులు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ట్రైనింగ్ రిటైర్డు లైఫ్ మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ జీఎస్.రామయ్య శర్మ పేర్కొన్నారు. గురువారం శిలాయుగం నాటి రాతి సమాధులను స్థానికులతో కలిసి పరిశీలించారు. సుమారు ఈకొండపై 200కు పైగా రాతి సమాధులు ఉన్నాయని, స్థానికులు, గొర్రెల కాపరులకు తెలియనితనంతో వాటిని ధ్వసం చేయడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటివి కడప జిల్లా రాయచోటిలో కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. కోసిగి తిమ్మప్ప కొండలో కూడా క్రీస్తు పూర్వం నాటి ఆనవాళ్లు ఉన్నాయని, సుమారు వెయ్యి ఏళ్ల క్రితంగా ఇవి ఉండవచ్చని భావించారు.