ఇంకానా?
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:06 AM
మండలంలోని సిద్ధాపురం గ్రామానికి వచ్చిన డీఈవో శామ్యూల్ పాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏమిటి గ్రామానికి రోడ్డు లేదు, బస్సులు లేవంటూ గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. శనివారం సిద్ధాపురంలో ‘పల్లెకి పోదాం’లో భాగంగా ప్రత్యేక అధికారిగా వచ్చిన డీఈవో పల్లె పరిస్థితులను చూసి నివ్వెరపోయారు
హాలహర్వి మండలం సిద్ధాపురం గ్రామానికి రోడ్డులేకపోవడంతో డీఈవో ఆశ్చర్యం
హాలహర్వి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సిద్ధాపురం గ్రామానికి వచ్చిన డీఈవో శామ్యూల్ పాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏమిటి గ్రామానికి రోడ్డు లేదు, బస్సులు లేవంటూ గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. శనివారం సిద్ధాపురంలో ‘పల్లెకి పోదాం’లో భాగంగా ప్రత్యేక అధికారిగా వచ్చిన డీఈవో పల్లె పరిస్థితులను చూసి నివ్వెరపోయారు. ఇక్కడికి ఉపాధ్యా యులు రోజూ పల్లెలు ఇంత వెనుకబడి ఉన్నాయా, ఉపాధ్యాయులు రోజూ ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. గ్రామానికి చెందిన బసవరాజుగౌడ్, రామన్నగౌడ్, సర్పంచ్ మారెన్న తమ కష్టాలను డీఈవోకు వివరించారు. కలెక్టర్‌కు చెప్పి గ్రామానికి రోడ్డు మంజూరు చేయించాలని కోరారు. స్పందించిన డీఈవో ఈ రోజే కలెక్టర్‌తో మాట్లాడతానని హమీ ఇచ్చారు.
వెల్దుర్తి: రత్నపల్లి గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులసీదేవి, మల్లెపలిలో ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ మురళీధర్‌రెడ్డి, నార్లాపురం గ్రామంలో సెరీకల్చర్ డీడీ ఆంజనేయులు పర్యటించారు. ఎంపీడీవో సుహాసినమ్మ, డిప్యూటీ ఎంపీడీ రవికిశోర్ సిబ్బంది పాల్గొన్నారు.