భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:38 PM
రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్
వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన జిల్లా అధికారులు
కర్నూలు కలెక్టరేట్, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ప్రభుత్వ అంశాలపై సమీక్షించారు. స్వామిత్ర, మైనర్ ఇరిగేషన్, స్వచ్ఛాంధ్ర అవార్డులు జువైనల్ కేసులు, పాజిటివ్ పబ్లిక్ పెరసెప్షన్ వంటి మొదలగు విషయాలు చర్చించి తగు సూచనలు ఇచ్చారు. స్వచ్ఛ గ్రామం, స్వచ్ఛ మున్సిపాలిటీ, స్వచ్ఛ హాస్పిటల్, స్వచ్ఛ బస్టాండు, స్వచ్ఛ హాస్టల్, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయం, స్వచ్ఛ అంగన్‌వాడీలకు జిల్లాలో స్వచ్ఛ అవార్డులు, రాష్ట్ర స్థాయి అవార్డులు అక్టోబరు 2న ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా, జేసీ బి.నవ్య, డీఆర్వో వెంకట నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.