Share News

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి

ABN , Publish Date - Oct 31 , 2025 | 11:41 PM

మద్యపానం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితాలు బుగ్గిపాలవుతాయని, వాటికి దూరంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి పిలుపునిచ్చారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
ర్యాలీలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి, న్యాయాధికారులు, న్యాయవాదులు

జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి

కర్నూలు లీగల్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మద్యపానం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితాలు బుగ్గిపాలవుతాయని, వాటికి దూరంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి పిలుపునిచ్చారు. ట్రాఫిక్‌ రూల్స్‌, డ్రంకెన్‌ డ్రైవ్‌, మాదక ద్రవ్యాల నిర్మూలనపై శుక్రవారం జరిగిన బైక్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కబర్ధి మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించి వాహనాలను నడపాలని కోరారు. మద్యం, మాదక ద్రవ్యాలు సేవించి ప్రమాదాలకు గురైతే.. వారి జీవితాలతో పాటు మొత్తం కుటుంబాలు నష్టపోతాయని ఆయన తెలిపారు. జిల్లా కోర్టు నుంచి కొండారెడ్డి బురుజు వరకు జరిగిన ర్యాలీలో బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ హరినాథ్‌ చౌదరి, అదనపు జిల్లా న్యాయాధికారులు పి.కమలాదేవి, వి.లక్ష్మిరాజ్యం, ఎం.శోభారాణి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, న్యాయాధికారులు సరోజినమ్మ అనూష, రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌ భరత్‌ చవాన్‌, ఆర్టీసీ డీఎం సుధారాణి, డీఎస్పీ బాబు ప్రసాద్‌, ట్రాఫిక్‌ సీఐ మన్సూరుద్దీన్‌, సీఐ రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 11:41 PM