సీఎం విజనరీతోనే రాష్ట్ర ప్రగతి
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:43 AM
సీఎం చంద్రబాబు విజనరీతోనే రాష్ట్రం అన్ని విధాలుగా ప్రగతి పథంలో పయనిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత పేర్కొన్నారు.
హైదరాబాద్ నేడు విశ్వనగరంగా ఖ్యాతి
ఒక్కో నియోజకవర్గానికి
ఐదుగురితో సాధికార బృందం
తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత
కర్నూలు న్యూసిటీ, జూన 9(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు విజనరీతోనే రాష్ట్రం అన్ని విధాలుగా ప్రగతి పథంలో పయనిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత పేర్కొన్నారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ దార్శనికత కార్యా చరణ కార్యాలయాన్ని మంత్రి కమిషనర్ రవీంద్రబాబుతో కలిసి ప్రారం భించారు. ఈసందర్భంగా మంత్రి టీజీ భరత మాట్లాడుతూ విజన అనగానే అందరికీ చంద్రబాబే గుర్తుకు వస్తారన్నారు. రెండోసారి ము ఖ్యమంత్రి అయ్యాక విజన-2020కి శ్రీకారం చుట్టారన్నారు. దాని ఫలి తంగానే నేడు హైదరాబాద్ విశ్వనగరంగా ప్రఖ్యాతి గాంచిందన్నారు. భావితరాల కోసం విజన-2047 కార్యక్రమానికి నాంది పలికారన్నారు. రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ స్థాయిలో ప్రజలు, ప్రజాప్రతి నిధుల నుంచి అభిప్రాయాలను తీసుకుని వాటికి విజన డాక్యుమెంటరీ రూపొందించి వాటి అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద న్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదుగురు విద్యావంతులతో సాధికార బృందాన్ని ఏ ర్పాటుచేసిందన్నారు. వీరు నియోజకవర్గ అభివృద్ధికి కార్యాచరణ అమలు కోసం పనిచేస్తారని, ఫలితంగా నియోజకవర్గ అభి వృద్ధికి దోహదపడుతుందన్నారు. అనంతరం కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ సాధికార బృందాలకు ఒక కార్యాలయం ఉండాలనే ఉద్దే శంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. త్వరలో అన్ని వసతులతో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అనంతరం విజన-2047 ప్లాన బుక్ లెట్‌ను మంత్రి, అధికారులు ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, మేనేజర్ చిన్నరా ముడు, ప్రజారోగ్య అధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, ఇనచార్జి ఎస్‌ఈ శేషసాయి, శానిటేషన సూపర్‌వైజర్ నాగరాజు పాల్గొన్నారు.