Share News

ముగిసిన రాష్ట్రస్థాయి అంధుల చెస్‌ పోటీలు

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:55 AM

పట్టణంలోని జీవనజ్యోతి ఇంక్లూజివ్‌ స్కూల్‌ ఆవరణలో రెండవ ఆలిండియా చెస్‌ ఫెడరేషన ఫర్‌ బ్లైండ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అంధుల రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు ఆదివారం ముగిశాయి.

ముగిసిన రాష్ట్రస్థాయి అంధుల చెస్‌ పోటీలు
రాష్ట్రస్థాయి చెస్‌ పోటీల్లో పాల్గొన్న అంధులు

నంద్యాల హాస్పిటల్‌, జూన 15(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని జీవనజ్యోతి ఇంక్లూజివ్‌ స్కూల్‌ ఆవరణలో రెండవ ఆలిండియా చెస్‌ ఫెడరేషన ఫర్‌ బ్లైండ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అంధుల రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. రామకృష్ణ పీజీ కళాశాల డైరెక్టర్‌ హేమంతకుమార్‌ మాట్లాడుతూ సౌతజోన జాతీయస్థాయి అంధుల క్రీడలు నిర్వహించేందుకు తాము సహకరిస్తామన్నారు. చీఫ్‌ ఆర్బిటర్‌ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో సకలాంగుల కంటే దివ్యాంగులు చక్కగా పాల్గొన్నారన్నారు. డా.రామకృష్ణారెడ్డి రూ.30వేల నగదు బహు మతి, సర్టిఫికెట్లు బహూకరించారన్నారు. పోటీల్లో ప్రథమస్థానం రఘు రామ్‌, ద్వితీయ స్థానం పల్లా గణేష్‌, మూడో స్థానం మురళికి దక్కింది. అండర్‌-19విభాగంలో అయిదుగురు బహుమతులు సాధించారన్నారు. మహిళా విభాగంలో ముగ్గురికి బహుమతులు అందజేశారు. టోర్నమెంట్‌ నిర్వహణకు బీవీఎస్‌ అండ్‌ బీవీ చారిటబుల్‌ ట్రస్ట్‌, భవనాశి జ్యువెలర్స్‌ భోజన సదుపాయం కల్పించారు. టోర్నమెంట్‌లో ఇంటర్నేషనల్‌ చెస్‌ క్రీడలో టాప్‌టెన రేటింగ్‌ క్రీడాకారులు పాల్గొనడం విశేషం. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం షబానా, సుగుణావతి, ఫినిహాసరావు, వలి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 12:55 AM