కర్నూలులో స్టేట్ తలసేమియా సెంటర్
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:33 AM
రాష్ట్రంలో మొదటిసారిగా కర్నూలు రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ఆవరణలో స్టేట్ అడ్వాన్స్‌డ్ తలసేమియా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు.
రెడ్‌క్రాస్ సొసైటీ ఆవరణలో ఏర్పాటు
రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్
కర్నూలు హాస్పిటల్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మొదటిసారిగా కర్నూలు రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ఆవరణలో స్టేట్ అడ్వాన్స్‌డ్ తలసేమియా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. బుధవారం రెడ్‌క్రాస్ సొసైటీ ఆవరణలో సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి సభ్యులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల తరహాలో గర్భిణులకు తలసేమియా వ్యాధిని గుర్తించే జనిటిక్ టెస్టులను ఇక్కడే చేస్తారన్నారు. భవన నిర్మానానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని టీజీ హామీ ఇచ్చారు. అనంతరం రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డా.గోవిందరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో వెయ్యి మంది తలసేమియా బాధితులు ఉన్నారని, వీరికి ప్రతి నెల రెండు, మూడుసార్లు రక్తమార్పిడి, మూడు నెలలకు బ్లడ్ టెస్టులు అవసరమని అన్నారు. వీరికి సైన సేవలందక మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు డా.కేవీ సుబ్బారెడ్డి, మీనాక్షి, గార్గేయపురం శ్రీనివాసులు, మాజీ కార్పొరేటర్ బాబురాజ్ పాల్గొన్నారు.