Share News

MP Naga Raju: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి..

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:50 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగ రాజు అన్నారు.

MP Naga Raju: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి..
గొందిపర్లలో ప్రజలకు కరపత్రాన్ని అందిస్తున్న ఎంపీ నాగరాజు, కేడీసీసీబీ చైర్మన విష్ణువర్ధనరెడ్డి

ఎంపీ బస్తిపాటి నాగరాజు

కర్నూలు రూరల్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగ రాజు అన్నారు. కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో సోమవారం జరిగిన తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ నాగరాజు, కేడీసీసీబీ చైర్మన విష్ణువర్ధనరెడ్డి కలిసి పాల్గొన్నారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పఽథకాల గురించి ఎంపీ ప్రజలకు వివరించారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పరిష్కరించాలని గ్రామ స్థులు ఎంపీ, కేడీసీసీబీ చైర్మన దృష్టికి తీసు కెళ్లారు. సంబంధిత అధికా రులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని వారు హామీనిచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 06:26 AM